`బాహుబలి` సిరీస్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ ఓ నేషనల్ స్టార్. అందుకే… అప్‌కమింగ్ ప్రాజెక్ట్ `సాహో`ని ఆ స్థాయిలోనే చేపట్టాడు ఈ కటౌట్ ప్లస్ కంటెంట్ ఉన్న స్టార్ హీరో. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్-ఇండియా అప్పీల్‌తో తెరకెక్కుతుండగా… ప్రముఖ బాలీవుడ్ నటీనటులతో పాటు దక్షిణాది నటులు కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో… ఈ సినిమాకు సంబంధించి ఓ చిన్న అప్‌డేట్ వచ్చినా నేషనల్ వైడ్ అటెన్షన్ వస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరి… అలాంటి `సాహో` ప్రజెంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమిటి? ప్రస్తుతం మాత్రం… ఈ సినిమాకి సంబంధించిన పోరాట ఘట్టాల చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ గా వేసిన ఓ సెట్‌లో జరుగుతోంది. ముగింపు సన్నివేశాల్లో భాగంగా వచ్చే పోరాట దృశ్యాలవి. ఇవి పూర్తయ్యాక… పాటల చిత్రీకరణ జరుగుతుంది. దాంతో చిత్రీకరణ పూర్తవుతుందని టాక్. ఇక విజువల్ ఎఫెక్ట్స్‌కి స్కోప్ ఉన్న సినిమా కావడంతో… వాటిని కూడా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది యూనిట్. ఇప్పటికే… 50 శాతం సీజీఐ వర్క్ పూర్తయ్యిందని… మిగిలి ఉన్న వర్క్ మే నాటికి పూర్తవుతుందని సమాచారం. జూన్ కల్లా సినిమా పూర్తిగా రెడీ అవుతుందని… జూలై నుంచి ప్రమోషనల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయని సమాచారం. ఆ తరువాత… అనుకున్న ప్రకారంగా ఆగస్టు 15 నుండి `సాహో` థియేటర్లలో సందడి చేస్తోంది. ఇదీ… ప్రస్తుతం `సాహో`ప్రోగ్రెస్ రిపోర్ట్ పై ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. `బాహుబలి` సిరీస్ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టే ఫలితం అందుకోవాలని ఆకాంక్షిద్దాం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో `సాహో` విడుదల కానుంది.
[youtube_video videoid=9o8Ri5PH1VE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: