వైవిధ్యభరితమైన పాత్రల్లో కనిపించడానికి ఉత్సాహం చూపించే కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటారు. గత చిత్రం `భరత్ అనే నేను`లో యువ ముఖ్యమంత్రి పాత్రలో అలరించిన మహేష్… తాజా చిత్రం `మహర్షి`లో మూడు విభిన్న ఛాయలున్న పాత్రలో కనిపించనున్నాడు. కాలేజ్ స్టూడెంట్‌గా, సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేతగా, ఆధునిక రైతుగా ఆయన దర్శనమివ్వనున్నాడు. అంతేకాదు… త్వరలోనే పట్టాలెక్కనున్న తన 26వ చిత్రంలోనూ ఇదివరకు చేయని ఓ పాత్రని చేయబోతున్నాడట ఈ టాలెంటెడ్ హీరో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `1 నేనొక్కడినే` విడుదలైన ఐదేళ్ళ గ్యాప్ తరువాత బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో… సూపర్ స్టార్ ఓ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నాడని టాలీవుడ్ టాక్. కాస్త నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర అయినప్పటికీ… `పోకిరి` తరహాలో గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ ఈ క్యారెక్టర్‌లో ఉంటాయని సమాచారం. మరి… ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. జూన్ నుంచి పట్టాలెక్కనున్న ఈ సినిమా… 2020 వేసవికి తెరపైకి రానుంది.
[youtube_video videoid=GPU0CAGGzAU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: