సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తి రాజకీయాల్లో మమేకమైపోయారు. ఒక రకంగా ఇది అభిమానులను బాధించే విషయమే అయినా.. తమ అభిమాన హీరో రాజకీయాల్లో కూడా తన సత్తా చూపించాలని… అక్కడ కూడా తన ముద్ర వేయాలని కోరుకుంటున్నారు. మళ్లీ పవన్ సినిమాల్లోకి వస్తాడా? రాడో కూడా తెలియదు. కానీ పవన్ ఏ మాత్రం కాస్త ఇంట్రెస్ట్ చూపించినా… ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు. మరి అది ఎప్పుడు జరుగుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే… గతంలో తమిళ్ ప్రొడ్యూసర్ ఏ.ఎమ్ రత్నం తో పవన్ సినిమా చేయాల్సి ఉంది. అంతేకాదు ఆ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ ఆ తరువాత పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం.. పూర్తిగా రాజకీయాల్లోనే బిజీ అవ్వడం వల్ల సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు తాను చేయాల్సిన ప్రాజెక్టును తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు పవన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఏ.ఎమ్ రత్నం కూడా ఈ సినిమా తీయడానికి సరైన డైరెక్టర్ కోసం చూస్తున్నాడట. అయితే వార్తలైతే వస్తున్నాయి కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరి చూద్దాం పవన్ సినిమా తన మేనల్లుడైనా పట్టాలెక్కిస్తాడేమో..!
[youtube_video videoid=A0zDh5Sgb-0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: