టాలీవుడ్ లో మినిమమ్ గ్యారంటీ హీరో ఎవరైనా ఉన్నారంటే న్యాచురల్ స్టార్ నాని అని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించినా మంచి లాభాలను తెచ్చిపెడుతుంటాయి. నాని సినిమాలకు ఇప్పటివరకూ 30 కోట్ల బడ్జెట్ కాలేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైమ్ నాని సినిమాకు కూడా భారీ బడ్జెట్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం నాని జెర్సీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సమ్మర్ లో ఏప్రిల్ 19వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా తరువాత నాని 24 ప్రాజెక్ట్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఉండబోతుంది. ఈ సినిమా షూటింగ్ ఈనెల నుండే ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారట. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అంతేకాదు 50కోట్ల బడ్జెట్ ను ఈ సినిమా కోసం కేటాయించారట నిర్మాతలు. మరి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన మనం, 24 సినిమాలు మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాంటి విక్రమ్ పై మాములుగానే అంచనాలు ఉంటాయి. దానికి తోడు నాని.. అందులోనూ భారీ బడ్జెట్ చూద్దాం ఎలా ఉంటుందో మరి.
ఇదిలా ఉండగా నాని ‘జెర్సీ’ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగినట్టు సమాచారం. ఈ సినిమా హిట్టయితే నానికి సగం ఒత్తిడితో పాటు.. మార్కెట్ కూడా పెరుగుతుంది. దాంతో నాని 24 కూడా ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
[youtube_video videoid=Rl6T0bM94Qs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: