ప్రస్తుతం” ఎన్టీఆర్- మహానాయకుడు” రిలీజ్ లోనూ, మణికర్ణిక వివాదంలోనూ బిజీగా ఉన్న దర్శకుడు క్రిష్ అన్నపూర్ణ కాంపౌండ్ లో అఖిల్ హీరోగా సినిమా చేస్తున్నారనే వార్తలు కొన్ని వెబ్ సైట్స్ లో, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అఖిల్ అక్కినేని మూడవ చిత్రం” మిస్టర్ మజ్ను” కూడా నిరాశపరచడంతో అఖిల్ కు ఒక సినిమా చేయమని నాగార్జున డైరెక్టర్ క్రిష్ ను కోరినట్లుగా అందుకు క్రిష్ ఓకే చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తల్లోని నిజా నిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నించింది “దతెలుగుఫిలింనగర్.కామ్”.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక వెబ్ సైట్ లో వచ్చిన ఈ వార్తా కథనాన్ని టాగ్ చేస్తూ “Krish Garu… is it true” అని మెసేజ్ పోస్ట్ చేసిన వెంటనే “No Sir” అని రిప్లై ఇచ్చారు డైరెక్టర్ క్రిష్. మరి అటు అక్కినేని కాంపౌండ్ నుండి గానీ, ఇటు డైరెక్టర్ క్రిష్ నుండి గానీ ఎలాంటి కన్ఫర్మేషన్ లేకుండా ఈ వార్త ఎలా పుట్టిందో తెలియదు.
అదిగో తోక అంటే…ఇదిగో పులి అన్న చందంగా పుట్టే ఇలాంటి వార్తలు అటు పాఠకులలో అనవసర ఆసక్తిని కలిగించడమే కాకుండా ఇటు సెలెబ్రెటీలను కూడా ఇబ్బందులపాలు చేస్తుంటాయి.
[youtube_video videoid=l2KmkThwcic]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: