అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన సినిమా ఇది. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు… అటు తమిళ్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో విజయ్ దేవరకొండకు అక్కడ ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన సినిమాలను ఇప్పుడు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగులో విజయ్ అర్జున్ రెడ్డి కంటే ముందు ద్వారక సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను తమిళ్ లో రిలీజ్ చేయనున్నారు. శ్రీనివాస రవీంద్ర దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, పూజా జవేరి ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం ద్వారక. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీజ్యోతి క్రియేషన్స్ బ్యానరుపై ఏఎన్ బాలాజీ తమిళంలో నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి టైటిల్ బాగా పాపులర్ కావడంతో ఈ పేరుతో ద్వారక డబ్బింగ్ వర్షెన్‌ని తమిళంలో విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. మరి దీన్ని బట్టి చూస్తే అర్జున్ రెడ్డికి ఉన్న క్రేజ్ ఏంటో అర్ధమవుతోంది. ద్వారక మూవీకి తమిళ్ లో అర్జున్ రెడ్డి అని టైటిల్ పెట్టడం కాస్త విచిత్రంగానే ఉంది. చూద్దాం మరి తమిళ్ లో ఈసినిమా ఎలా ఆడుతుందో..!
[youtube_video videoid=y_7VRMwdOI8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: