బాలీవుడ్ లో సార్ట్ హీరోతో మరో బంపరాఫర్

Rashmika Mandanna Confirmed As Heroine For Sikandar

ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. పుష్ప సినిమాతో తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ఇక ఈ ఏడాది యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం అయితే వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక. ఇప్పటికే పుష్ప2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. ఇది కాక ఇంకా లేడి ఓరియెంటెడ్ సినిమా అయిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా, ధనుష్ హీరోగా వస్తున్న కుబేర సినిమా ఇంకా యానిమల్2 సినిమాలో నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు బాలీవుడ్ లో మరో బంపరాఫర్ కొట్టేసింది రష్మిక. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సికిందర్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. ఇదిలా ఉండగా ఈసినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్నట్టు చిత్రయూనిట్ తాజాగా అధికారికంగా తెలియచేసింది. రష్మిక కూడా తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. చాలా కాలం నుండి తన నెక్స్ట్ సినిమా ఏంటని అడుగుతున్నారు.. సికిందర్ లో నటిస్తున్నాను.. సికిందర్ లో భాగమైనందుకు సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ లో తెలియచేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.