యూఎస్ కు వెళ్లనున్న మిస్టర్ బచ్చన్ టీం
Mr Bachchan team will be flying to America this week

హరీష్ శంకర్,మాస్ మహా రాజా రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా మిస్టర్ బచ్చన్.ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగి గా కనిపించనున్నాడు.సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది .ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీం యూఎస్ వెళ్లనున్నారు.ఈ షెడ్యూల్ లో సాంగ్స్ తోపాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.దాంతో సినిమా దాదాపు పూర్తయినట్లే.
రవితేజ మార్క్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.జూలై లేదా ఆగస్టు లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈసినిమా కాకుండా రవితేజ రీసెంట్ గా మరో సినిమా అనౌన్స్ చేశాడు.సామజవరగమన రైటర్ భాను భోగవరపు ఈసినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.ఇది రవితేజకి 75వ సినిమా కానుంది.అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రానుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.







