మ‌రోసారి త‌మిళ ద‌ర్శ‌కుడితో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

Vijay Deverakonda To Team Up With A Tamil Director Again,Telugu Filmnagar,Latest Telugu Movie News,2019 Telugu Cinema Updates,Tollywood Film News,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie Updates,Vijay Deverakonda Next Film Updates,Hero Vijay Deverakonda Next Movie With A Tamil Director Again
Vijay Deverakonda To Team Up With A Tamil Director Again

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లతో ముందుకు సాగుతున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్రస్తుతం… ఈ యూత్ ఐకాన్ ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అద‌య్యే లోపే… క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అధినేత కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ బ్యానర్‌లో క్రాంతి మాధవ్ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించ‌డంతో… విజ‌య్ న‌టించ‌బోయే సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే… `నోటా` త‌రువాత మ‌రో త‌మిళ ద‌ర్శ‌కుడితో సినిమా చేసేందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ఇటీవ‌ల ఓ త‌మిళ ద‌ర్శ‌కుడు విజ‌య్‌ను సంప్ర‌దించి… ఓ ఇంటరెస్టింగ్ ఎలిమెంట్‌తో బైక్ చుట్టూ తిరిగే కథను చెప్పాడ‌ట‌. కథ నచ్చడంతో విజయ్ ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ని టాక్‌. క్రాంతి మాధవ్ సినిమా తర్వాత… ఈ బైక్ స్టొరీని పట్టాలెక్కించే ఆలోచనలో విజయ్ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే… ఈ రెండు సినిమాల తర్వాత హ్యాట్రిక్ సంస్థ‌ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమాను చేయబోతున్నాడ‌ట‌ విజయ్ దేవరకొండ. ఈ చిత్రానికి యువ ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరిగానీ మరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గాని దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం.

[subscribe]

[youtube_video videoid=1ZLTAIfJzvc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.