ఈ తరం నిర్మాతలలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న ప్రొడ్యూసర్ ఎవరంటే… నిస్సంకోచంగా `దిల్` రాజు అనే చెప్పాలి. ముఖ్యంగా… 2017లో అయితే ఆరు సినిమాలను నిర్మించడమే కాకుండా వరుస విజయాలతో `డబుల్ హ్యాట్రిక్` కొట్టి నయా రికార్డు సృష్టించారు. అయితే… 2018లో మాత్రం ఆ మ్యాజిక్‌ని కంటిన్యూ చేయలేకపోయారు రాజు. కాగా… తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన `ఎఫ్ 2`తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్… ఈ సంవత్సరం కూడా 2017లో తరహాలోనే ఆరు చిత్రాలతో పలకరించే దిశగా అడుగులు వేస్తున్నారని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ఈ ఏడాదిలో ఇప్పటికే ‘ఎఫ్-2’తో తొలి బ్లాక్‌బస్టర్ కొట్టిన `దిల్` రాజు… ఏప్రిల్ 25న మహేష్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ ని విడుదల చేయనున్నారు. ఆ తరువాత… శర్వానంద్, సమంత జంటగా రూపొందనున్న ‘96’ రీమేక్‌ని మార్చిలో పట్టాలెక్కించి జూలైలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారట. అలాగే `ఎంసీఏ` డైరెక్టర్ వేణు శ్రీరామ్‌తో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు రాజు. ఆ తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని… అదేవిధంగా మరో నోటబుల్ డైరెక్టర్‌తో ఇంకో సినిమాని ప్లాన్ చేస్తున్నారట. ఈ మూడు చిత్రాలను కూడా ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేసే ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. అయితే… ఈ చిత్రాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
2017లో `దిల్` రాజు జైత్రయాత్ర సంక్రాంతి చిత్రం `శతమానం భవతి`తో మొదలై క్రిస్మస్ కానుకగా విడుదలైన `ఎంసీఏ` వరకు కొనసాగింది. ఈ ఏడాది కూడా సంక్రాంతికి విడుదలైన `ఎఫ్ 2`తో మొదలైన `దిల్` రాజు విజయయాత్ర… మరో `డబుల్ హ్యాట్రిక్`కి నాందిగా భావించక తప్పదేమో. ఈ నేపథ్యంలో… 2017 నాటి మ్యాజిక్ ను ఈ ఏడాది కూడా `దిల్` రాజు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.
[youtube_video videoid=QflKrauKmEk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: