సూపర్ హిట్ మూవీ గ్యాంగ్ స్టర్ తో బాలీవుడ్ లో ఎంటరయిన కంగన రనౌత్ నటించిన ఫ్యాషన్, రాజ్, కైట్స్, తను వెడ్స్ మను, క్రిష్3 , క్వీన్, సిమ్రన్ సినిమాలు ఘనవిజయం సాధించాయి. ఫ్యాషన్, క్వీన్, తను వెడ్స్ మను చిత్రాలకు బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్స్ కంగన సొంతం చేసుకున్నారు. గాడ్ ఫాదర్ లేకుండా, ఓపెన్ గా మాట్లాడుతూ కంగన రెబల్ స్టార్ అనిపించుకున్నారు. బ్రిటిష్ సేనను ఎదిరించి, పోరాడిన వీర వనితఝాన్సీ రాణి లక్ష్మీ బాయ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన మణికర్ణిక- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ మూవీలో కంగన రాణి లక్ష్మీ బాయ్ గా నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కైరోస్ కంటెంట్ స్టూడియోస్ బ్యానర్ పై క్రిష్, కంగన రనౌత్ సంయుక్త దర్శకత్వం లో రూపొందిన మణికర్ణిక- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ మూవీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 50దేశాలలో హిందీ, తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ కానుంది. రాజ్ పుత్ కర్ణి సేన ఈ మూవీ లో రాణి లక్ష్మీ బాయ్ ని అవమానించారని, మణికర్ణిక మూవీ నిలుపుదలకు కోర్ట్ లో కేస్ వేసింది. కోర్ట్ ఆ అభ్యంతరాన్ని కొట్టివేసింది. మణికర్ణిక మూవీ ని అడ్డుకుంటామని కర్ణి సేన అంటుంది. నలుగురు చరిత్రకారులు మణికర్ణిక మూవీ ని చూసి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, తాను కూడా రాజ్ పుత్ నేనని, మణికర్ణిక మూవీ ని కర్ణి సేన వ్యతిరేకిస్తే , వారి అంతుచూస్తానని కంగన రనౌత్ అన్నారు.
[youtube_video videoid=7nPC51zv0-o]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: