`ఎఫ్ 2` ఘనవిజయం… మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లో సరికొత్త ఉత్సాహం నింపింది. ప్రస్తుతం ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో… రెండు చిత్రాలను చేసేందుకు సిద్ధమవుతున్నాడు. వాటిలో ఒకటి నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించనున్న స్పోర్ట్స్ డ్రామా కాగా… మరొకటి సీనియర్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించనున్న `జిగర్తండా` రీమేక్. వీటిలో ముందుగా `జిగర్తండా` రీమేక్ పట్టాలెక్కే అవకాశముందని టాలీవుడ్ టాక్. వినిపిస్తున్న కథనాల ప్రకారం… ఈ సినిమాకి సంబంధించిన ప్రారంభోత్సవాన్ని ఈ నెల 27న హైదరాబాద్‌లో జరిపేందుకు నిర్ణయించారని తెలిసింది. వరుణ్ తేజ్‌తో పాటు నాగశౌర్య కూడా ఈ చిత్రంలో నటించనున్నాడని ఆ మధ్య కొన్ని కథనాలు వచ్చాయి. కాగా… 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ సినిమాని నిర్మించనున్నారు. యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ బాణీలను అందించనుండగా… అయాంక బోస్ ఛాయాగ్రహణం అందించనున్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన `జింగర్తడా`… రీమేక్ వెర్షన్‌లోనూ మెప్పిస్తుందేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=gshVc2_zZOA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: