కొర‌టాల సినిమా కోసం బ‌రువు త‌గ్గ‌నున్న చిరు?

Chiranjeevi Movies Latest News, Chiranjeevi Stunning Physical Transformation, Chiranjeevi to Lose Weight for Koratala Siva Movie, Chiranjeevi Weight Loss For His Next Movie, Chiru on a Weight Loss Mission, Latest Telugu Movies 2019, MegaStar Chiranjeevi to Lose Weight For Koratala Siva Movie, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Chiranjeevi to Lose Weight For Koratala Siva Movie

`ఖైదీ నంబ‌ర్ 150`తో రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి… క‌మ్ బ్యాక్ ఫిల్మ్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో జ‌మ చేసుకున్నారు. ప్ర‌స్తుతం త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా న‌రసింహారెడ్డి`తో ఫుల్ బిజీగా ఉన్నారు చిరు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని చిరు త‌న‌యుడు, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుద‌లకు ముందే… మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నారు చిరు. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందించ‌నున్న ఈ ప్రాజెక్ట్‌… ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. ఫిబ్ర‌వ‌రి లేదా మార్చి నుంచి ఈ సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. ఇదిలా ఉంటే… `సైరా`లోని ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పాత్ర కోసం కాస్త బ‌రువు పెరిగిన చిరు… కొర‌టాల ప్రాజెక్ట్ కోసం బ‌రువు త‌గ్గి కాస్త స్లిమ్‌గా క‌నిపించాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో… త‌ను లేని ఎపిసోడ్స్‌ని ముందుగా చిత్రీక‌రించ‌మ‌ని కొర‌టాల‌తో చెప్పార‌ట చిరు. కొర‌టాల కూడా అదే ఆలోచ‌న‌తో ఉన్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం లొకేష‌న్ల వేట‌లోనూ… న‌టీన‌టుల ఎంపిక ప్ర‌క్రియ‌లోనూ యూనిట్ బిజీగా ఉంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=mz6uyTzjAtA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =