రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో… ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన ద్విభాషా చిత్రం `7/జి బృందావన కాలనీ` (తమిళంలో `7/జి రెయిన్‌బో కాలనీ`)… రెండు చోట్ల ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ సినిమాకి… యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలచింది. అలాగే కంటెంట్ కూడా రియలిస్టిక్‌గా ఉండి… కుర్రకారు జేజేలు అందుకుంది. ఎ.ఎం.రత్నం నిర్మించిన ఈ సినిమా… బెంగాలీలో `ప్రేమ్ అమర్` పేరుతోనూ, ఒడియాలో `బలుంగా టోక` పేరుతోనూ, కన్నడలో `గిల్లి` (రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ ఫిల్మ్) పేరుతోనూ రీమేక్ అయి… అన్ని చోట్ల విజయం సాధించింది. కాగా… దాదాపు 15 ఏళ్ళ తరువాత ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని బాలీవుడ్ మీడియా సమాచారం. ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీతో పాటు టి-సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని టాక్. మంగేష్ హడవలె దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ బాలీవుడ్ నటుడు జావేద్ జఫ్పేరి తనయుడు మీజన్ జఫ్పేరి హీరోగా పరిచయం కానున్నాడు. త్వరలోనే ఈ రీమేక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=24py8F41eD4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: