హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన తమిళ చిత్రం `96`… తమిళనాట ఘనాతిఘన విజయం సాధించింది. విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మెచ్యూర్డ్ లవ్‌స్టోరీ ద్వారా సి.ప్రేమ్ కుమార్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. గతేడాది అక్టోబర్ 4న విడుదలైన ఈ సినిమా తరువాత… త్రిష మళ్ళీ కోలీవుడ్‌లో బిజీ స్టార్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే… ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత `దిల్` రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్… తెలుగు వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించనున్నాడు. విజయ్ సేతుపతి పాత్రలో శర్వానంద్, త్రిష పాత్రలో సమంత కనిపించే అవకాశముంది. కాగా… ఒరిజినల్ వెర్షన్‌లో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం 1996 నాటి నేపథ్యాన్ని తీసుకుంటే… తెలుగు వెర్షన్‌లో 2009 నాటి నేపథ్యాన్ని తీసుకుని… అందుకు అనుగుణంగా కథాకథనాలను మలుచుకుంటున్నారని సమాచారం. మరి… ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. అంతేకాదు… మార్చిలో ఈ సినిమాని ప్రారంభించి… జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. త్వరలోనే ఈ రీమేక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా రానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=qzw6iLHHRtM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: