వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా మిస్టర్.మజ్ను. ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న అఖిల్ ఈ సినిమా గురించి ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ స్క్రిప్ట్ టూ ఇయర్స్ బ్యాకే మీకు వెంకీ చెప్పాడు కదా.. మరి రెండు సంవత్సరాలు ఎందుకు టైం తీసుకున్నారు.. ఎదైనా కారణం ఉందా?
లేదు అప్పటికే ఓ సినిమాను ఒప్పుకోవడం జరిగింది వినాయన్ గారితో.. ఆల్రెడీ మా నాన్నగారి ప్రొడక్షన్ లో చేయలన్నా ఐడియాలో ఉన్నాం … మళ్లీ మా నాన్న గారికి ఈ స్క్రిప్ట్ నచ్చుతుందో లేదో అన్న డౌట్ లో ఉన్నా ఇలా ఒకటి కాదు చాలా కారణాలే ఉన్నాయి.. అందుకే నేను వెంకీ కి ముందే చెప్పాను.. వెంకీ నువ్వు కావాలంటే వేరే సినిమా చేసుకో.. ఎందుకంటే నేను చేయబోయే సినిమా ఒక సంవత్సరం పైనే టైం తీసుకోవచ్చు అని చెప్పాను.. తను కూడా నేను ఖాళీగా అయితే ఉండేది లేదు… కానీ ఈ స్టోరీ మాత్రం మీకోసం హోల్డ్ చేసి పెడతా అని చెప్పాడు..అందుకే ఇంత టైం పట్టింది తప్పా ఇంకేం లేదు.. అందుకే ఇది నా మూడో సినిమా అయింది.
కథ విన్నప్పుడే బాగా నచ్చేసిందట మీకు.. ఈ కథలో మిమ్మల్ని అంతగా ఆకట్టుకున్న అంశాలు ఏంటి?
ఇన్ స్టాంట్ గా నచ్చేసింది నాకు. ఎందుకు నచ్చిందంటే వేరీ క్యారెక్టర్ బేస్డ్. ఒక నటుడిగా నాకు ఛాలెంజింగా అనిపించింది. నేను ఇంతకుముందు చేసిన రెండు సినిమాల్లో ఎలాంటి యాక్టింగ్ చేశానో దానికి ఇది పూర్తిగా ఆపోజిట్ ఇది. సో నాకు చాలా ఎగ్డైట్ మెంట్ అనిపించింది.
మీ ఫ్రెండ్ తో చేయడం ప్లస్ పాయింట్ అనుకుంటున్నారా?
వెంకీ నాకు ఎప్పటినుండో తెలుసు..కానీ బెస్ట్ ఫ్రెండ్ కాదు..కామన్ సర్కిల్ లో ఎక్కువ తెలుసు.. కామన్ ఫ్రెండ్స్ ద్వారా చాలా సార్లు కలిసాం. ఈ సినిమా ద్వారా 3 సంవత్సరాల నుండి టచ్ లో ఉన్నాం..కానీ ఈ సినిమా ద్వారా నే క్లోడ్ ఫ్రెండ్స్ లో ఒకటయ్యాడు వెంకీ.
అఖిల్, హలో సినిమాలు కంటే.. ఈ సినిమా చాలా స్పీడ్ గా చేశారు ?
అలా ఏమి లేదు. కాకపోతే ‘హలో’కి స్క్రిప్ట్ విషయంలో చాలా వర్క్ చేశాం, అలాగే ఆ సినిమాకి షూటింగ్ డేస్ కూడా ఎక్కువ పట్టాయి. అఖిల్ కి కూడా అలాగే జరిగింది. కానీ ‘మిస్టర్ మజ్ను’ ఫుల్ స్క్రిప్ట్ తో వెంకీ రెడీగా ఉండటం వల్ల ఈ సినిమా కొంచం స్పీడ్ గా అయింది.
తొలిప్రేమ సినిమా ముందే ఈ స్టోరీ వెంకీ మీకు చెప్పారంటున్నారు కదా..తొలిప్రేమ తరువాత స్టోరీ లో ఏమన్నా మార్పులు చేశారా?
ఎలాంటి ఛేంజెస్ జరగలేదు..లోకేషన్ వైజ్ గా అమెరికా నుండి లండన్ మారింది అంతేకానీ స్క్రిప్ట్ లో మాత్రం ఎలాంటి ఛేంజెస్ లేవు.
మజ్ను అనే టైటిల్ పెట్టినప్పుడు ఏదైనా టెన్షన్ పడ్డారా?
టెన్షన్ ఏం కాదు..ఇది అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ.. తను మిస్టర్ అని ఎందుకు పెట్టాడంటే…మజ్ను అనగానే ఒక చిన్న ట్రాజడీ ఫీలింగ్ వచ్చేస్తది.. మనం మిస్టర్ మజ్ను అని టైటిల్ పెట్టి పోస్టర్స్, ట్రైలర్ తో ఒక మోడ్రన్ మజ్ను..యంగ్ ఎనర్జిటిక్ లవ్ స్టోరీ చూపిద్దామనే ఉద్దేశంతోనే మిస్టర్ మజ్ను అని పెట్టడం జరిగింది.
మీ ఫ్యామిలీలో మూడు జనరేషన్లు మజ్నుతో ట్రావెల్ అయ్యారు.. ఎలా ఫీలవుతున్నారు?
ఐ ఫీల్ ప్రౌడ్..ఆ పేరు చెడగొట్టాలని మాత్రం నేననుకోవడంలేదు…ఈటైటిల్ బాగా కలిసొచ్చింది మా ఫ్యామిలీకి..
ఈ సినిమా కోసం 8 ప్యాక్ చేశారు. కారణమేంటి?
అది శేఖర్ మాస్టర్ వల్ల జరిగింది… నేను వద్దనుకున్నాను ఈసినిమాకు..హలో కు కూడా కొంచెం బాడీని పెంచాను.. ఫస్ట్ సినిమాకు చూపించేశాను ఎందుకనుకున్నాను.. లవ్ స్టోరీని లవ్ స్టోరీలా చేద్దామనుకున్నాను.. శేఖర్ మాస్టర్ నన్ను కన్విన్స్ చేశారు.
నాన్నగారు జూ ఎన్టీఆర్ గారి నుంచి ఏదో నేర్చుకోమన్నారు ?
మాస్ నేర్చుకోమన్నారు. మాస్ ఎలా నేర్చుకోవాలో ఒకసారి అడగాలనుంది నాన్నగారిని. జనరల్ గా బయట తారక్ నాకు కాంప్లిమెంట్స్ ఇవ్వడు. కానీ ఆడియో ఈవెంట్ లో నా గురించి మాట్లాడుతూ (నవ్వుతూ) చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.
థమన్ మ్యూజిక్ ఎలా ఉంది?
ఒక లవ్ స్టోరీకి మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు..సో ఈ సినిమాలో సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ సాంగ్స్ బాగా ఇచ్చాడని నేననుకుంటున్నాను.
మల్టీస్టారర్ మూవీస్ వస్తున్నాయి కదా.. మీరెప్పుడు మల్టీస్టారర్ చేస్తున్నారు?
చేస్తాను. గతంలోనే ఓ మల్టీస్టారర్ చెయ్యమని అడిగారు. కానీ అప్పుడు చెయ్యటం కరెక్ట్ కాదు అని చెయ్యలేదు. కానీ ఖచ్చితంగా ఉంటుంది.. కథ నచ్చితే మాత్రం ఫ్యూచర్ లో మల్టీస్టారర్ చేస్తాను. ఐదారుమంది హీరోలున్నా చేస్తాను..బావుంటుంది చాలా ఫన్ ఉంటుంది కదా.
[youtube_video videoid=l2KmkThwcic]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: