సరిగ్గా ఐదేళ్ళ క్రితం `1 నేనొక్కడినే` వంటి వైవిధ్యభరితమైన చిత్రంతో ఆకట్టుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో… మరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్… `శ్రీమంతుడు` వంటి ఘనవిజయం తరువాత మహేష్ కాంబినేషన్‌లోనూ… `రంగస్థలం` వంటి సంచలన విజయం తరువాత సుకుమార్ కాంబినేషన్‌లోనూ ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించనున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే… ఈ చిత్రానికి `హర హర శంభో శంకర` అనే టైటిల్‌ని రిజిస్టర్ చేయించారట సుకుమార్. అయితే… ఈ టైటిల్‌ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేరిట కాకుండా… సుకుమార్ కో-డైరెక్టర్ రిజిస్టర్ చేయించడం ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి… ఈ టైటిల్ ఈ సినిమా కోసమేనా? లేదంటే మరేదైనా సినిమాకా? అనేది త్వరలోనే క్లారిటీ వస్తుంది. కాగా… మహేష్, సుకుమార్ చిత్రం రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని టాక్.
[youtube_video videoid=8MrsVBpIV4k]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: