సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `మహర్షి`తో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని సి.అశ్వనీదత్, దిల్ రాజు, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తయ్యాక సుకుమార్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు మహేష్. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివేంజ్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే… `అర్జున్ రెడ్డి` దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనూ మహేష్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం… ఇదొక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనుందని టాలీవుడ్ టాక్. అంతేకాదు… ఈ చిత్రాన్ని ఏసియన్ సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, ఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయని తెలుస్తోంది. మొత్తానికి… ఒకదానితో ఒకటి సంబంధం లేని మూడు డిఫరెంట్ ప్రాజెక్ట్‌లతో మహేష్ అభిమానులను అలరించనున్నాడన్నమాట
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=GPU0CAGGzAU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: