`మహానటి`తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన కేరళకుట్టి కీర్తి సురేష్… తెలుగు సినిమాల కంటే తమిళ చిత్రాలతోనే ఇటీవల కాలంలో ఫుల్ బిజీగా ఉంది. గత ఏడాది కీర్తి నటించిన తమిళ చిత్రాలు `సామి`, `పందెం కోడి 2`, `సర్కార్`… పేర్లతో తెలుగులోనూ అనువాదమయ్యాయి. ఇదిలా ఉంటే… తాజాగా కీర్తి సురేష్ మరో భారీ బడ్జెట్ మూవీలో హీరోయిన్‌గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కోలీవుడ్ సమాచారం ప్రకారం… విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామాలో నయనతార ఓ కథానాయికగా నటిస్తుండగా… మరో నాయికగా కీర్తి సురేష్ ఎంపికయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకు విజయ్‌కి జోడీగా `భైరవ`, `సర్కార్` చిత్రాల్లో నటించిన కీర్తి… ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అతనికి జోడీగా నటించే అవకాశాన్ని దక్కించుకుందన్నమాట. త్వరలోనే కీర్తి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. కాగా… తెలుగులో కీర్తి ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది. నూతన దర్శకుడు నరేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అమెరికా నేపథ్యంలో తెరకెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=fQhu517vBRw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: