నటసింహ నందమూరి బాలకృష్ణకి కలిసొచ్చిన దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన `సింహా`, `లెజెండ్` బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అంతేకాదు… ఈ రెండు సినిమాలతో `ఉత్తమ నటుడు`గా `నంది` అవార్డులను కూడా అందుకున్నారు బాలయ్య. అలా… బాలకృష్ణకు గుర్తుండిపోయే కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన బోయపాటి… త్వరలోనే హ్యాట్రిక్ మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమా… `సింహా` తరహాలో ఉంటుందని… ఆ చిత్రంలోలాగే బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. తొలుత… హ్యాట్రిక్ ప్రాజెక్ట్ కోసం పొలిటికల్ టచ్ ఉన్న సబ్జెక్ట్ చేయాలని బోయపాటి ప్లాన్ చేసినప్పటికీ… కొన్ని కారణాల వల్ల ఆ కథను పక్కను పెట్టేశారని టాక్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. 2020 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=xeXXbPfPuDg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: