`1 నేనొక్కడినే` తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని తెలుస్తోంది. జూన్ నుంచి పట్టాలెక్కనున్న ఈ సినిమాని… 2020 వేసవికి విడుదల చేయనున్నారని టాలీవుడ్ టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇదిలా ఉంటే… ప్రస్తుతం మహేష్ తన 25వ చిత్రం `మహర్షి`తో ఫుల్ బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్, `దిల్` రాజు, ప్రసాద్ వి.పొట్లూరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో్ `అల్లరి` నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రం… వేసవి సందర్భంగా ఈ ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=xfhWWIfJuLA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: