రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, రవివర్మ, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా `మిఠాయి`. ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు మనకు అందిస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ను మన ముందుకు తీసుకొచ్చారు. అదేంటంటే..ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఫిబ్రవరి 22వ తేదీన `మిఠాయి` సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ ద్వారా తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రెడ్ యాంట్స్ పతాకంపై ప్రభాత్ కమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పెళ్లి చూపులు ఫేమ్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఇప్పటికే పోస్టర్లు, పాటలతో మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=wW5JX4ppqtk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: