మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘ముఠామేస్త్రి’ ఒకటి. అంతేకాదు.. వీరి కలయికలో వచ్చిన ఆఖరి సినిమా కూడా ఇదే కావడం విశేషం. కూరగాయల మార్కెట్‌లో ఉండే ఓ మేస్త్రి… పొలిటికల్ లీడర్‌గా ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం ఇది. చిరంజీవికి జోడీగా మీనా, రోజా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, అల్లు రామలింగయ్య, గుమ్మడి, మన్సూర్ అలీ ఖాన్, శరత్ సక్సేనా, కోట శ్రీనివాసరావు, జె.వి.సోమయాజులు, యువరాణి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాని కామాక్షి దేవీ కమల్ కంబైన్స్ పతాకంపై కె.సి.శేఖర్ బాబు, డి.శివప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. రాజ్-కోటి స్వరసారధ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా ‘ఈ పేటకు నేనే మేస్త్రి’ పాట బాగా పాపులర్ అయింది. అలాగే.. ‘ఎంత ఘాటు ప్రేమయో’, ‘అంజనీ పుత్రుడా’, ‘జోరుగున్నాది’, ‘చికిచికి చామ్’ పాటలు కూడా మాస్ ప్రేక్షకులను అలరించాయి. 1993 జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ముఠామేస్త్రి’… నేటితో 26 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: