‘హలో’ ఫేమ్ కల్యాణీ ప్రియదర్శన్ ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రలహరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సమ్మర్ లో ఏప్రిల్ 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు తాజాగా తన కొత్త సినిమా గురించి మరో అప్ డేట్ ఇచ్చింది కల్యాణి ప్రియదర్శి. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అండ్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యారంటూ తన ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసింది. కీర్తి సురేష్ ప్రొడక్షన్స్ పై ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
https://www.instagram.com/p/Bssi-MQADnb/
ఇక ఈ సినిమానే కాకుండా కల్యాణి ప్రియదర్శి పలు సినిమాల్లో నటిస్తుంది. ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘మరక్కార్: అరబికడలింటే సింహమ్’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శి ఓ కీలక పాత్రలో నటిస్తుంది. దీనితో పాటు పింక్ రీమేక్ లో కూడా ఈ భామ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
[youtube_video videoid=ISSJx9e4em0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: