టాలీవుడ్‌లో `షార్ట్ టైమ్ బాయ్ ఫ్రెండ్`… అదే `ప్లే బాయ్` క్యారెక్టర్‌లతో సందడి చేస్తున్న కథానాయకుల సంఖ్య పెరుగుతోందా? దీనికి సమాధానంగా అవుననే చెప్పుకోవాలి. అప్పుడెప్పుడో 18 ఏళ్ళ క్రితం `ప్రేమతో…రా!` అంటూ విక్టరీ వెంకటేష్ ప్లే బాయ్ గా అలరిస్తే… 8 ఏళ్ళ క్రితం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ `ఆరెంజ్`తో షార్ట్ టర్మ్ లవ్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మ్యూజికల్ గా ఈ రెండు సినిమాలూ మెప్పించాయి. ఇక వర్తమానంలోకి వస్తే… అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న `Mr. మజ్ను` కూడా ఓ షార్ట్ టైమ్ బాయ్ ఫ్రెండ్ కథే. ఇప్పుడు ఈ హీరోల బాటలోనే… యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కూడా వెళ్ళనున్నాడని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు` ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ కి జోడీగా రాశీ ఖన్నా, కేథరిన్ త్రెసా, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. కాగా… ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో విజయ్ ప్లే బాయ్ పాత్రలో కనిపించనున్నాడట. మరి… ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: