తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయే సినిమాలలో… నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘సమరసింహారెడ్డి’ ఒకటి. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో… కొన్నేళ్ళ పాటు తెలుగు సినిమా ఫ్యాక్షన్ బాట పట్టింది. మరికొన్ని ఘనవిజయాలనూ మూటగట్టుకుంది. ఇక ‘సమరసింహారెడ్డి’ విషయానికొస్తే… నందమూరి బాలకృష్ణలోని నటుడ్ని కొత్తగా ఆవిష్కరించిన చిత్రమిది. నవరసాలను అద్భుతంగా పలికించి… అభిమానుల చేతే కాదు… సగటు ప్రేక్షకుల నుంచి కూడా జేజేలు అందుకున్నాడు. సిమ్రాన్, అంజలా ఝవేరి, సంఘవి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో జయప్రకాష్ రెడ్డి, పృధ్వీరాజ్, తిలకన్, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, జయచిత్ర, సుమిత్ర, సంగీత, సుజిత, బేబి శ్రేష్ఠ, జయలలిత, ఎమ్మెస్ నారాయణ, దేవరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను…శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై చెంగల వెంకటరావు నిర్మించారు. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ అందించిన సంభాషణలు అదనపు బలంగా నిలచాయి. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ‘చలిగా ఉందన్నాడే’, ‘అడీస్ అబ్బబ్బా’, ‘లేడీ లేడీ కన్నెలేడీ’, ‘అందాల ఆడబొమ్మ’, ‘రావయ్య ముద్దులమామ’, ‘నందమూరి నాయకా’… ఇలా ప్రతీ పాట మాస్ ప్రేక్షకుడ్ని కట్టిపడేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 13, 1999న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సమరసింహారెడ్డి’ … నేటితో 20 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘సమరసింహారెడ్డి’ – కొన్ని విశేషాలు:
* బాలకృష్ణ – మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రమిది. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో మరో 11 చిత్రాలు వచ్చాయి. వాటిలో `నరసింహనాయుడు`, `లక్ష్మీ నరసింహా` మంచి విజయం సాధించాయి. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి కానుకగానే విడుదలైన చిత్రాలు కావడం విశేషం.
* ‘లారీడ్రైవర్’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ లాంటి సూపర్ హిట్ మూవీస్ తర్వాత బాలయ్య, బి.గోపాల్ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రమిది. ఈ సినిమాతో వీరి కాంబినేషన్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు… ఇండస్ట్రీ హిట్‌ను కూడా సొంతం చేసుకున్నారు. `సమరసింహారెడ్డి` తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన `నరసింహనాయుడు`కూడా ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం విశేషం.
* ‘ప్రేమించుకుందాం… రా!’, ‘చూడాలని వుంది!’ వంటి బ్యాక్ టు బ్యాక్ సెన్సేషనల్ హిట్స్ తర్వాత హీరోయిన్ అంజలా ఝవేరి నటించిన ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించి… ఆమెని హ్యాట్రిక్ హీరోయిన్ చేసింది.
*బాలకృష్ణకి జోడీగా తొలిసారిగా సిమ్రాన్, అంజలా ఝవేరి, సంఘవి నటించిన సినిమా ఇది. వీరిలో సిమ్రాన్ మాత్రమే తదనంతర కాలంలో బాలయ్యకి హిట్ పెయిర్ అనిపించుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: