కెరీర్ ఆరంభంలో వరుసగా మూడు విజయాలను అందుకుని `హ్యాట్రిక్ హీరోయిన్` అనిపించుకుంది… పంజాబీ జాబిలి మెహరీన్. `కృష్ణగాడి వీరప్రేమగాథ`, `మహానుభావుడు`, `రాజా ది గ్రేట్` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ… ఆ తరువాత మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో… సంక్రాంతి కానుకగా శనివారం విడుదలైన `ఎఫ్ 2` హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా… వసూళ్ళ పరంగానూ మెప్పిస్తోంది. దీంతో… మెహరీన్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేసినట్లే. కేవలం సక్సెస్ మాత్రమే కాదు… నటిగానూ మరోసారి తన ప్రతిభను చాటుకుంది ఈ పంజాబీ జాబిలి. `హనీ ఈజ్ ద బెస్ట్` అంటూ మెహరీన్ చేసిన సందడికి ఆమె అభిమానులు ఫుల్ ఫిదా అయిపోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశేషమేమిటంటే… మెహరీన్ ప్రీవియస్ హిట్ మూవీ `రాజా ది గ్రేట్`కి దర్శకుడైన అనిల్ రావిపూడి, నిర్మాత `దిల్` రాజు కాంబినేషన్‌లోనే `ఎఫ్ 2` కూడా వచ్చింది. మొత్తమ్మీద… `దిల్` రాజు, అనిల్ రావిపూడి మరోసారి టాలెంటెడ్ బ్యూటీ మెహరీన్‌కు కలిసొచ్చారన్నమాట. ఈ సందర్భంగా… మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేసిన టాలెంటెడ్ బ్యూటీ మెహరీన్‌కి హార్టీ కంగ్రాట్స్ చెబుతోంది `ద తెలుగుఫిలిం నగర్. కామ్`. అలాగే… మున్ముందు మరిన్ని విజయాలతో మెహరీన్ ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: