మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ అనగానే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ కళ్ళముందు కదలాడతాయి. అటువంటి ఈ ఇద్దరి కలయికలో వచ్చిన చిత్రమే ‘ముగ్గురు మొనగాళ్లు’. చిన్నప్పుడు విడిపోయిన అన్నదమ్ములు మళ్ళీ ఎలా కలుసుకున్నారనే సింపుల్ లైన్‌తో ఈ సినిమా రూపొందింది. యాక్షన్, సెంటిమెంట్‌తో పాటు కామెడీని కూడా బాగా జోడించి ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు దర్శకేంద్రుడు. ముఖ్యంగా డ్యాన్స్ మాస్టర్ దత్తాత్రేయ పాత్రలో చిరు చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. చిరు అభిమానులను ఎంతగానో అలరించిన ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై కె.నాగబాబు, పవన్ కళ్యాణ్ నిర్మించారు. చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో రోజా, నగ్మా, రమ్యకృష్ణ కథానాయికలుగా నటించారు. శ్రీవిద్య, బ్రహ్మానందం, శరత్ సక్సేనా తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు. విద్యాసాగర్ స్వరాలను సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలన్నీ అప్పట్లో అభిమానులను ఉర్రూతలూగించాయి. వాటిలో ‘రాజశేఖరా’, ‘కొట్టు కొట్టు కొబ్బరికాయ’, ‘రా రా గోపాలా’, ‘చామంతి పువ్వా’, ‘ఆజా ఆజా’, ‘నువ్వొక్కసారి అంటే’ పాటలు మాస్ ప్రేక్షకులను అలరించగా… ‘అమ్మంటే’ పాట హృదయాలను తాకుతుంది. వీటిలో ‘రాజశేఖరా’ పాటలో చిరు డ్యాన్స్ మూమెంట్స్ అలాగే… ‘రా రా గోపాలా’ పాటలో చిరు, రమ్యకృష్ణ చేసే డ్యాన్స్ ఎప్పటికీ అభిమానులకు గుర్తుండి పోతాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 7, 1994న విడుదలైన ఈ సినిమా… నేటితో 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ముగ్గురు మొనగాళ్లు’ – కొన్ని విశేషాలు:
* చిరంజీవి కెరీర్‌లో తొలి త్రిపాత్రాభినయ చిత్రం.
* ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’ లాంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత చిరు, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందిన సినిమా.
* అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌పై ‘రుద్రవీణ’, ‘త్రినేత్రుడు’ తర్వాత నిర్మితమైన మూడో చిత్రం.
* చిరంజీవి, రమ్యకృష్ణ జంటగా నటించిన ఫస్ట్ మూవీ.
* చిరంజీవి హీరోగా విద్యాసాగర్ సంగీతం అందించిన తొలి చిత్రం.
[youtube_video videoid=XVrR0aXDPuk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: