క్రిష్ దర్శకత్వంలో నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు పార్ట్ లుగా తెరెక్కుతున్న ఈ బయోపిక్ లో మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9వ తేదీన రిలీజ్ కానుంది. ఈ పార్ట్ లో ఎన్టీఆర్ సినీ జీవితం గురించి చూపించనున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ను ఎప్పటినుండో మొదలుపెట్టారు చిత్రయూనిట్. పలు ఛానళ్లలకు ఇంటర్వ్యూలను ఇస్తూనే..మరోపక్క వినూత్నంగా ప్రమోషన్స్ చేయడానికి సిద్దపడ్డారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే పలు థియేటర్లలో ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టించాలని చూస్తున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు వంద ఎన్టీఆర్ విగ్రహాలను ప్రతిష్టించాలని చూస్తున్నారట. కాగా ఇలా చేయడం తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారి. అంతేకాదు మొదటి విగ్రహాన్నీ బాలకృష్ణ, విద్యాబాలన్ కలిసి తిరుపతిలోని పీజేఆర్ థియేటర్ లో ప్రతిష్టించనున్నారట. వీటితో పాటు డైరెక్టర్ క్రిష్, బాలకృష్ణ, విద్యాబాలన్ కలిసి విజయవాడ, బెంగళూరు, తిరుపతిలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
కాగా ఎన్ బి కె ఫిలిమ్స్, విబ్రి మీడియా, వారాహి చలన చిత్ర బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ సినిమాను..ఎన్టీఆర్ కథా నాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు పార్ట్ లుగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కధానాయకుడు పార్ట్ లో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని చూపించనుండగా.. ఎన్టీఆర్ మహానాయకుడు పార్ట్ లో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. ఈ పార్ట్ ను ఫిబ్రవరి 7 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
[youtube_video videoid=SIx3-oBW_rA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: