మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు కాంబినేషన్ అంటే ఓ సంచలనం. వీరి కలయికలో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. వాటిలో ‘మాంగల్యబలం’ ఒకటి. ఏఎన్నార్, సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రంలో… ఎస్.వి.రంగారావు, రేలంగి, రమణారెడ్డి, రమణమూర్తి, సూర్యకాంతం, రాజసులోచన, కన్నాంబ, జి.వరలక్ష్మి ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డి.మధుసూదనరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళంలో ‘మంజల్ మహిమై’ పేరుతో ఏకకాలంలో చిత్రీకరణ జరిపారు. బెంగాలీ చిత్రం ‘అగ్నిపరీక్ష’ (1954)కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు మధుసూదనరావు. సంగీత దర్శకుడు మాస్టర్ వేణు స్వరపరచిన పాటలన్నీ అప్పట్లో శ్రోతలను అలరించాయి. ముఖ్యంగా… ‘ఆకాశవీధిలో అందాల జాబిలి’, ‘వాడిన పూలే వికసించెలే’ పాటలు ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా నిలిచిపోయాయి. 1959లో సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలైన ‘మాంగల్యబలం’… నేటితో 60 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=eilAfotzIs4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: