సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం `పేట`… ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. `బాషా` తరువాత మళ్ళీ 24 ఏళ్ళ అనంతరం … సంక్రాంతికి వస్తున్న రజనీకాంత్ సినిమా కావడంతో… `పేట`పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నెల 10న తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే… `పేట` రిలీజ్ అయిన వెంటనే… రజనీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నారని ఆ మధ్య వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం… బ్రిలియంట్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా ఫిబ్రవరిలో పట్టాలెక్కనుందని తెలుస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాకి `నార్కాలి` (`కుర్చీ` అని అర్థం) అనే టైటిల్ పరిశీలనలో ఉండగా… రజనీ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారని టాక్. అనిరుధ్ సంగీతమందించనున్న ఈ సినిమాకి ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్‌గా కన్‌ఫర్మ్ అయ్యాడని వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడుతాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=h2K6y-aVFD8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: