మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం `సైరా నరసింహారెడ్డి`. తొలి తెలుగు స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా… మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాకి సంబంధించి… తదుపరి షెడ్యూల్ సంక్రాంతి తరువాత హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగనుందని సమాచారం. అంతేకాదు… మార్చి చివరి నాటికి చిత్రీకరణ పూర్తిచేసి… ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ కి బాగా స్కోప్ ఉన్న సినిమా కావడంతో… గ్రాఫిక్స్ కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించనుంది యూనిట్. ఇక సినిమాని ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి తీసుకురానున్నారని సమాచారం. బహుశా… దసరాకి ఈ పిరియాడిక్ డ్రామా థియేటర్లలో సందడి చేసే అవకాశముంది. చిరంజీవి సరసన నయనతార, తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది బాణీలు అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=1w5SRCH0hA4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: