దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరైన సీనియర్ డైరెక్టర్ మణిరత్నం 1983 సంవత్సరంలో పల్లవి అనుపల్లవి కన్నడ మూవీ తో దర్శకుడు గా పరిచయమయ్యారు. తమిళం లో మణిరత్నం రూపొందించిన నాయకన్, అంజలి, దళపతి, రోజా, బాంబే, దిల్ సే, చెక్క సివంద వానం వంటి సినిమాలు ఘనవిజయం సాధించాయి. తెలుగు లో రూపొందించిన ఏకైక చిత్రం గీతాంజలి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రాల తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. మణిరత్నం ఇప్పుడు విక్రమ్, శింబు,జయం రవి హీరోలుగా ఒక బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ రూపొందించనున్నారని సమాచారం. దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందే ఈ మూవీ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అందాల తార ఐశ్వర్యా రాయ్ నటించనున్నారని సమాచారం.
చారిత్రాత్మక కధాంశం తో రూపొందనున్న ఈ మూవీ భారతీయ చలన చిత్ర చరిత్ర లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ కానుంది.
[youtube_video videoid=RjSeTHHQO1U]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: