యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ తేజ ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త తరహా కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి `సీత` అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు… టైటిల్ రోల్‌లో నటిస్తున్న కాజల్… తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తోందట. డబ్బు పిచ్చి ఉన్న అమ్మాయిగా నెగటివ్ టచ్ క్యారెక్టర్‌లో కాజల్ నటిస్తోందట. ఆ పాత్రే… సినిమాకి హైలైట్ అని సమాచారం. ఇక… బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కూడా ఇప్పటివరకు చేయని కొత్త తరహా పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. కాగా… ఈ సినిమాని తొలుత ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావించినప్పటికీ… తాజా సమాచారం ప్రకారం మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు అఫిషియల్‌గా వెలువడుతాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=lBi8ocJHLuc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: