విశ్వవిఖ్యాత నట సార్వభౌమ యన్.టి.రామారావు కథానాయకుడిగానే కాదు… దర్శకుడిగానూ తెలుగు తెరపై అద్భుతాలు సృష్టించారు. ఒక వైపు హీరోగా వరుస సినిమాలతో, విజయాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న సమయంలోనే… మరోవైపు దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టి సాహసాలు చేశారాయన. పౌరాణిక చిత్రం ‘సీతారామ కళ్యాణం’(1961)తో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన యన్టీఆర్… మొదటి సినిమాతోనే ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు… సరిగ్గా ఏడాది తరువాత… జానపద చిత్రం ‘గులేబకావళి కథ’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి దర్శకుడిగా మరో మరపురాని విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నారు. అయితే… ఈ సినిమాల టైటిల్ కార్డ్స్‌లో దర్శకుడిగా యన్టీఆర్ పేరు ఉండదు. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పతాకంపై యన్టీఆర్ సోదరుడు ఎన్.త్రివిక్రమరావు నిర్మించిన ఈ సినిమాని… అరేబియన్ జానపద కథల సంపుటి (‘వన్ థౌజండ్ అండ్ వన్ నైట్స్’) ఆధారంగా తెరకెక్కించారు. యన్టీఆర్ సరసన జమున, నాగరత్న కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో పేకేటి శివరాం, ముక్కామల, రాజనాల, ఛాయాదేవి, ఋష్యేంద్రమణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. జోసెఫ్ -విజయ్ కృష్ణమూర్తి సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ముఖ్యంగా `నన్ను దోచుకుందువటే` పాట అయితే… ఎవర్‌గ్రీన్ సాంగ్‌గా నిలచింది. ఈ సినిమా ద్వారానే ప్రముఖ గీత రచయిత సి.నారాయణ రెడ్డి పరిశ్రమలో తొలి అడుగులు వేశారు. ఇక రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రహణం కూడా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. 1962 జనవరి 5న విడుదలైన ఈ చిత్రం… నేటితో 57 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=V_udfo4Gsek]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: