బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వినయ విధేయ రామ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. సంక్రాంతి పండుగ కానుకగా ఈసినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే రామ్ చరణ్ లుక్ ను చూశాం కదా. రామ్ చరణ్ మామూలు ఫిట్ నెస్ గా లేడు. చెర్రీ బాడీని చూసి ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. నిజానికి రామ్ చరణ్ ఎప్పుడూ ఫిట్ గానే ఉంటాడు. కానీ ఈ సినిమాలో ఉన్న బాడీకి..ఇంతకు ముందు సినిమాల్లో ఉన్న బాడీకి చాలా డిఫరెన్స్ ఉంది. బోయపాటి చెర్రీని అలా చూపించాడు. ముఖ్యంగా ట్రైలర్‌లోని యాక్షన్ సీన్స్‌లో చెర్రీ బాడీని ఎలివేట్ చేస్తూ బాగా చూపించాడు. మరి బోయపాటి అలా చూపించాడంటే చెర్రీ తన బాడీని అలా తయారు చేసుకోవడానికి ఎంత కష్టపడి ఉంటాడు. మరి మన వినయ విథేయ రాముడు అంత ఫిట్ నెస్ గా ఉండటానికి… చేసిన డైట్ ప్లాన్ ఏంటో సతీమణి ఉపాసన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఆ డైట్ ప్లాన్ ఏంటో చూద్దాం ఒకసారి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఉదయం 8 గంటలకు బాదం పాలు, ఓట్స్, ఎగ్స్‌ను.. 11:30 గంటలకు ఒక పెద్ద కప్పు వెజిటబుల్ సూప్‌ను, 1:30 గంటలకు 200గ్రాముల చికెన్, 3/4 కప్పు బ్రౌన్ రైస్, సగం కప్పు గ్రీన్ వెజిటబుల్ కర్రీ, సాయంత్రం 4 గంటలకు 250 గ్రాముల గ్రిల్లిడ్ ఫిష్, 200 గ్రాముల స్వీట్ పొటాటో, సగం కప్పు గ్రీన్ వెజిటబుల్స్.. ఆరు గంటలకు పెద్ద కప్పు మిక్స్‌డ్‌గ్రీన్ సలాడ్, 1/4 అవకాడో, ఒక బౌల్ నిండా గింజలు, మళ్లీ ఆరు నుంచి రాత్రి 8 గంటల వరకు ఏమైనా ఆకలి వేస్తే.. నట్స్, పచ్చి కూరగాయలను స్నాక్స్‌గా తీసుకుంటాడట.
Hard work, Dedication & Discipline ! #ramcharan #vvr diet ! Try the diet ! Stay fit ! Stay healthy ! @rakeshru pic.twitter.com/Tz8xIFOvr9
— Upasana Konidela (@upasanakonidela) January 2, 2019
మరి కొంచెం కష్టంగానే ఉంది కదా డైట్ ప్లాన్. ఉంటుంది..మరి అలాంటి బాడీ రావాలంటే ఆ మాత్రం కష్టపడకుండా వచ్చేయదు కదా. ఇంకెందుకు ఆలస్యం.. చెర్రీ డైట్ ప్లాన్ ఫాలో అయిపోండి…ఫిట్ గా ఉండండి..
[youtube_video videoid=and6XZwInKM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: