టాలీవుడ్ లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు కూడా ఒకరని చెప్పొచ్చు. ఎన్నో మంచి మంచి సినిమాలను నిర్మిస్తూ..టాప్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు లిస్ట్ లు ఉండగా మరో రెండు సినిమాలు ఆ లిస్ట్ లో వచ్చి చేరాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 2 సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఎఫ్2 చిత్రం వినోదాత్మకంగా వుంటుందనే నమ్మకం కలిగించడంతో ఈ చిత్రం పట్ల పాజిటివిటీ నెలకొంది. ఇక మహేష్ ఇరవై అయిదవ చిత్రమైన మహర్షి వుండనే వుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలు కాకుండా మరో రెండు కొత్త సినిమాలు దిల్ రాజు ఖాతాలోకి వచ్చాయి. వెంకన్న దర్శనార్థం తిరుపతి వెళ్లిన దిల్ రాజు మీడియాతో ముచ్చటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…మార్చిలో మరో రెండు కొత్త సినిమాలను లాంచ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఆ సినిమాల గురించి ఎలాంటి సమాచారం మాత్రం ఇవ్వలేదు.
అయితే ఆ రెండు సినిమాలు ఏంటో అప్పుడే వార్తలు వినిపించేస్తున్నాయి. దిల్ రాజు ఇప్పటికే 96 సినిమా రైట్స్ దక్కించుకోవడంతో అది ఒక సినిమా అయి ఉండవచ్చని… ఇంకోటి నాని-దుల్కర్ సల్మాన్ తో మల్టీస్టారర్ అయి ఉండొచ్చని అంటున్నారు. మరి ఆ రెండు సినిమాలు ఈ రెండు సినిమాలేనా..?లేక ఇంకేమైనా ఉన్నాయా? అన్నది తెలియాలంటే మాత్రం దిల్ రాజు చెప్పేంత వరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=and6XZwInKM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: