యాత్ర మూవీ – జగ్గూభాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్

Jagapathi Babu First Look From Yatra,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Jagapathi Babu New Look From Yatra Movie,Jagapathi Babu in Yatra Movie,First Look of Jagapathi Babu in Yatra Movie,Yatra Movie Jagapathi Babu First Look
Jagapathi Babu First Look From Yatra

‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహి.వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్‌ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటిస్తుండగా..ఇప్పటికే మమ్ముట్టి ఫస్ట్ లుక్, టీజర్ ను రిలీజ్ చేయగా అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో మరో కీలక వ్యక్తి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో జగపతి బాబు కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వై.ఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో జగపతిబాబు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మంచి మీసకట్టుతో.. గంభీరమైన వదనంతో జగ్గూభాయ్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.

 

ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజవ్వగా.. రెండు రోజుల క్రితమే రాజన్నా నిన్నాపగలరా అనే పాట లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. వందేమాతరం శ్రీనివాస్ పాడిన ఆ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఇంకా ఈ సినిమాలో సుహాసిని, అనసూయ, రావు రమేష్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ మూవీకి కృష్ణ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా… విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 8 తేదీన ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

[youtube_video videoid=x0H7OpL3afE]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =