ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఆధారంగా కంగనా ప్రధాన పాత్రలో మణికర్ణిక సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదట ఈసినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా.. ముగింపు మాత్రం కంగనా చేతుల మీదగానే జరిగింది. ఇక ఇటీవలే ఈ సినిమా హిందీ ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా దానిలో కంగానే తన విశ్వరూపం చూపిందన్న ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ డేట్ ను ఫిక్స్ చేశారు. రేపు (1-4-2018) ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా జీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథని అందించారు. జనవరి 25వ తేదిన రిలీజ్ కానున్న ఈ సినిమాను.. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఒకే రోజు విడుదల చేయనున్నారు.
[youtube_video videoid=and6XZwInKM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: