దేవిశ్రీ ప్రసాద్… దాదాపు రెండు దశాబ్దాలుగా స్వరకర్తగా రాణిస్తున్న యువ సంగీత దర్శకుడు. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్‌లతో అలరిస్తున్న ఈ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్… ఈ సంక్రాంతికి రెండు సినిమాలతో అభిమానులను పలకరించనున్నాడు. ఆ చిత్రాలే… `వినయ విధేయ రామ`, `ఎఫ్ 2`. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన `వినయ విధేయ రామ` ఈ నెల 11న రిలీజ్ కానుండగా… విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలసి నటించిన `ఎఫ్ 2` ఈ నెల 12న తెరపైకి రానుంది. అంటే… ఈ సంక్రాంతికి డీఎస్పీ డబుల్ ధమాకా ఇవ్వనున్నాడన్నమాట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… గతంలోనూ డీఎస్పీ సంక్రాంతి సీజన్‌లో డబుల్ ధమాకా ఇచ్చిన సందర్భాలున్నాయి. 2005 సంక్రాంతికి `నా అల్లుడు`, `నువ్వొస్తానంటే నేనొద్దాంటానా`తో సందడి చేసిన దేవిశ్రీ… 2010లో `అదుర్స్`, `నమో వెంకటేశ` చిత్రాలతో మరో మారు డబుల్ ధమాకా ఇచ్చాడు. ఇక 2014లో `1 నేనొక్కడినే`, `ఎవడు` చిత్రాలతో ముచ్చటగా మూడోసారి సంక్రాంతి సీజన్‌లో డబుల్ ధమాకా ఇచ్చాడు. మళ్ళీ ఐదేళ్ళ తరువాత ఈ ఏడాది సంక్రాంతి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్. ఈ రెండు సినిమాలతోనూ దేవిశ్రీ ఖాతాలో విజయాలు జమ అవ్వాలని ఆశిద్దాం.
[youtube_video videoid=D-xVnEavqYs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: