అనుప‌మ రిపీట్ చేస్తుందా?

Will Anupama Repeat The Same Magic In Kannada Too,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Actress Anupama Upcoming Movies News,Heroine Anupama Next Movies,Heroine Anupama Next Project Details,Anupama Repeat the Same Magic
Will Anupama Repeat The Same Magic In Kannada Too

చేసింది త‌క్కువ సినిమాలే అయినా… క‌థానాయిక‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది కేర‌ళ‌కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. మ‌ల‌యాళ చిత్రం `ప్రేమ‌మ్‌`తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుప‌మ‌… మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. ఆ సినిమా తీసుకువ‌చ్చిన గుర్తింపుతో తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంది. అంతేకాదు.. మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ త‌ర‌హాలోనే తెలుగులో న‌టించిన తొలి చిత్రం `అఆ`తోనూ… త‌మిళంలో న‌టించిన మొద‌టి సినిమా `కొడి`తోనూ విజ‌యాల‌ను ఒడిసిప‌ట్టుకుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ‌… మ‌రో ద‌క్షిణాది భాష‌లో ఎంట్రీ ఇస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… పునీత్ రాజ్‌కుమార్ హీరోగా `న‌ట సార్వ‌భౌమ‌` పేరుతో ఓ క‌న్న‌డ చిత్రం తెర‌కెక్కుతోంది. `పోటుగాడు` చిత్రంతో తెలుగులోనూ ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న స‌క్సెస్‌ఫుల్ క‌న్న‌డ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ వాడేయ‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాతో… క‌న్న‌డ‌సీమ‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతోంది అనుప‌మ‌. అంతేకాదు… లాయ‌ర్ పాత్ర‌లో న‌ట‌న‌కు అవ‌కాశ‌మున్న పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఫిబ్ర‌వ‌రి 7న ఈ సినిమా తెర‌పైకి రానుంది. మ‌ల‌యాళ‌, తెలుగు, త‌మిళ భాష‌ల్లో మొద‌టి సినిమాల‌తో విజ‌యాల‌ను అందుకున్న అనుప‌మ‌… క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లోనూ ఈ ఫీట్‌ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.

[subscribe]

[youtube_video videoid=K2Ek6i2yB94]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =