మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ ది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. రాజేంద్రప్రసాద్ నిర్మాణంలోనూ… అలాగే దర్శకత్వంలోనూ ఏఎన్నార్ నటించిన పలు చిత్రాలు కమర్షియల్‌గా రాణించడమే కాదు… మ్యూజికల్‌గానూ మెప్పించాయి. రాజేంద్రప్రసాద్ నిర్మాణంలో… `ఆరాధన`, `ఆత్మ బలం`, `అంతస్థులు`, `ఆస్తిపరులు` వంటి మ్యూజికల్ సెన్సేషన్స్ తరువాత ఏయన్నార్ హీరోగా వచ్చిన చిత్రం `అదృష్టవంతులు`. వి.మధుసూదన రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఏయన్నార్‌కి జోడీగా జయలలిత నటించగా… ఇతర ముఖ్య పాత్రల్లో జగ్గయ్య, గుమ్మడి, రేలంగి, ప్రభాకర్ రెడ్డి, పద్మనాభం, సూర్యకాంతం, గీతాంజలి, విజయలలిత తదితరులు నటించారు. కె.వి.మహదేవన్ స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా `అయ్యయ్యో బ్రహ్మయ్య`, `మొక్కజొన్న తోటలో`, `ముద్దంటే చేదా` వంటి గీతాలు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. తమిళంలో శివాజీ గణేశన్ హీరోగా `తిరుడన్`పేరుతోనూ… హిందీలో జితేంద్ర హీరోగా `హిమ్మత్`గానూ రీమేక్ అయింది ఈ సినిమా. 1969 జనవరి 3న విడుదలైన `అదృష్టవంతులు`… నేటితో 50 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[youtube_video videoid=JItw_md5l8A]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: