`ఒక్కడు` (2003), `వర్షం` (2004), `నువ్వొస్తానంటే నేనొద్దాంటానా` (2005)… ఇలా వరుసగా మూడేళ్ళ పాటు సంక్రాంతి విజయాలను అందుకుని `సంక్రాంతి` రాజుగా పేరు తెచ్చుకోవడమే కాకుండా… ఆ మూడు చిత్రాలతో వరుసగా మూడు `ఫిల్మ్ ఫేర్` అవార్డులను సొంతం చేసుకున్నారు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు. ఇలాంటి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న ఈ అభిరుచి గల నిర్మాత నిర్మించిన తొలి చిత్రం `శత్రువు`. వెంకటేష్, విజయశాంతి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించారు. కోట శ్రీనివాసరావు ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో విజయ్ కుమార్, సంగీత, `మహర్షి` రాఘవ, నగేష్, బ్రహ్మానందం తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో… అప్పట్లో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా `పొద్దునే పుట్టింది` పాట ఇప్పటికీ మెలోడీ ప్రియులను అలరిస్తూనే ఉంది. 1991 జనవరి 2న విడుదలైన `శత్రువు`… నేటితో 28 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శత్రువు – కొన్ని విశేషాలు:
* `శత్రువు`తో నిర్మాణ రంగంలోకి దిగిన ఎమ్మెస్ రాజు… మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత వెంకటేష్ కాంబినేషన్‌లో నిర్మించిన `దేవీ పుత్రుడు` (2001) కూడా ఇదే జనవరి నెలలో సంక్రాంతి సీజన్‌లో విడుదలయ్యింది. `శత్రువు` దర్శకుడు కోడి రామకృష్ణనే ఈ సినిమాకి డైరెక్టర్ కావడం మరో విశేషం.
* `శత్రువు` తరువాత విజయశాంతి ప్రధాన పాత్రలో ఎమ్మెస్ రాజు రెండు చిత్రాలను నిర్మించారు. విజయశాంతి ద్విపాత్రాభినయంతో రూపొందిన `పోలీస్ లాకప్` మంచి విజయం సాధించగా… `స్ట్రీట్ ఫైటర్` ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
* `శత్రువు` పేరు చెప్పగానే మొదట గుర్తుకొచ్చేది కోట శ్రీనివాసరావు విలనిజమే. కొత్త తరహాలో సాగే ఈ ప్రతినాయకుడి పాత్రలో కోట జీవించారనే చెప్పాలి.
* హిందీలో ఈ సినిమాని `విజేత` పేరుతో రీమేక్ చేయగా… సంజయ్ దత్, రవీనా టాండన్ హీరోహీరోయిన్లుగా నటించారు.
[youtube_video videoid=i8YAJqqKAHs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: