`జులాయి`, `సన్నాఫ్ సత్యమూరి`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను సొంతం చేసుకున్న కాంబినేషన్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో దాదాపు నాలుగేళ్ళ తరువాత మరో సినిమా రాబోతోంది. వీరి గత రెండు చిత్రాలను నిర్మించిన హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మిస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా… ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే… `సన్నాఫ్ సత్యమూర్తి` తరహాలో కొత్త చిత్రం కూడా తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుందని సమాచారం. అయితే… ఇందులో భావోద్వేగాలకు మరింత ఎక్కువ స్కోప్ ఉంటుందని తెలుస్తోంది. బన్నీ పాత్రతో పాటు తండ్రి పాత్రకి కూడా కథలో సమప్రాధాన్యం ఉంటుందని టాక్. అందుకే… తండ్రి పాత్ర కోసం ఓ ప్రముఖ నటుడి పేరుని పరిశీలిస్తున్నారని వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.
[youtube_video videoid=Qet0IxVPoe8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: