‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి.వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వై.ఎస్ పాదయాత్ర ముఖ్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే ముగిసింది. ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా..ఇప్పటికే మమ్ముట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందరూ ఫిదా అయిపోయారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 తేదీన ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజవ్వగా… ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. రాజన్నా నిన్నాపగలరా అనే పాట లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. కాగా ఇంకా ఈ సినిమాలో జగపతిబాబు, సుహాసిని, అనసూయ, రావు రమేష్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ మూవీకి కృష్ణ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా… విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[youtube_video videoid=x0H7OpL3afE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: