ఆల్ టైమ్ టాప్ టెన్‌లో `ద ల‌య‌న్ కింగ్‌`

The Lion King Enters Into Top 10 Movies List,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,The Lion King Movie Updates,The Lion King Telugu Movie Latest News,The Lion King Highest Grossing Animated Film All-Time,The Lion King Movie Collections,The Lion King Movvie Box Office Collections

`ద ల‌య‌న్ కింగ్‌`.. 1994లో చారిత్ర‌క విజ‌యం సాధించిన అమెరిక‌న్ యానిమేట‌డ్ మ్యూజిక‌ల్ ఫిల్మ్‌. వాల్ట్ డిస్నీ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించిన‌ ఈ చిత్రం… పాతికేళ్ళ త‌రువాత అదే పేరుతో రీమేక్ అయ్యింది. ఈ సారి యానిమేటెడ్ ఫిల్మ్‌లా కాకుండా… ఫొటో-రియ‌లిస్టిక్ కంప్యూట‌ర్ యానిమేటేడ్ వెర్ష‌న్‌లో రీమేక్ అయి విడుద‌ల‌య్యింది. ‘ద జంగిల్ బుక్’ ద‌ర్శ‌కుడు జాన్ ఫేవరోవ్ ఈ సినిమాని రూపొందించాడు. జూలై 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం… భార‌త‌దేశంలోనూ ప‌లు భాష‌ల్లో అనువాద‌మై ఆడియన్స్‌ను అలరించింది. ఇక తెలుగు వెర్ష‌న్‌కు నాని, జ‌గ‌ప‌తి బాబు, ర‌విశంక‌ర్‌, బ్ర‌హ్మానందం, అలీ వంటి ప్ర‌ముఖులు గాత్ర‌మిచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… మొద‌టి ఆట నుంచే ప్రపంచవ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందుతున్న‌ ఈ చిత్రం… ఇప్ప‌టికీ వ‌ర‌ల్డ్ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ కుంభ‌వృష్టి కురిపిస్తోంది. అంతేకాదు… తాజాగా గ్లోబ‌ల్ బాక్సాఫీస్ వ‌ద్ద ఆల్ టైమ్ టాప్ టెన్‌లోనూ స్థానం ద‌క్కించుకుంది. ఈ జాబితాలో స్థానం ద‌క్కించుకున్న ఏకైక యానిమేటేడ్ ఫిల్మ్‌గా `ద ల‌య‌న్ కింగ్‌` నిలవడం విశేషం. దాదాపు 260 మిలియ‌న్‌ డాల‌ర్ల బ‌డ్జెట్‌తో రూపొందిన `ద ల‌య‌న్ కింగ్‌`… ఇప్ప‌టి వ‌ర‌కు 1.438 బిలియ‌న్ డాల‌ర్ల కలెక్షన్ల‌ను సాధించి తొమ్మిదో స్థానంలో నిలచింది. ఇంతవరకు ‘అవెంజ‌ర్స్ – ఏజ్ ఆఫ్ అల్ట్రాన్'(2015) 1.405 బిలియ‌న్ డాల‌ర్ల‌ వసూళ్లతో తొమ్మిదో స్థానంలో ఉండగా… ఇప్పుడు ఆ స్థానాన్ని `ద ల‌య‌న్ కింగ్‌` ఆక్రమించ‌డం విశేషం. ఇక ఈ జాబితాలో… `అవెంజ‌ర్స్‌.. ఎండ్ గేమ్`(2.795 బిలియ‌న్ డాల‌ర్లు), `అవ‌తార్‌` (2.789 బిలియ‌న్ డాల‌ర్లు), `టైటానిక్‌`(2.187 బిలియ‌న్ డాల‌ర్లు) తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

మ‌రి… ఇంకా థియేట‌ర్ల‌తో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న `ద ల‌య‌న్ కింగ్‌` ఫుల్ ర‌న్‌లో ఏ స్థానానికి చేరుకుంటుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 9 =