ఈ సారి త‌క్కువ‌ గ్యాప్‌లోనే రానున్న రాజ‌శేఖ‌ర్

Rajasekhar New Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Dr Rajasekhar Upcoming Movie News,Rajasekhar Next Film Updates,Dr Rajasekhar Upcoming Movies List,Hero Rajasekhar New Movie

‘గరుడవేగ’, ‘కల్కి’… ఇలా వరుసగా థ్రిల్లర్ మూవీస్‌తో సంద‌డి చేస్తున్న‌ సీనియర్ హీరో రాజశేఖర్… తాజాగా మరో థ్రిల్లర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఓ కన్నడ సినిమాకు రీమేక్‌గా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి ‘బేతాళుడు’ ఫేమ్ ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ నటుడు సత్యరాజ్ తనయుడు శిబీ సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాని త‌మిళ నిర్మాత‌ ధనుంజయన్ నిర్మిస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని… 2020 మార్చిలో విడుదల చేయడానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే… 2017 నవంబర్ 3న రాజశేఖర్ హీరోగా నటించిన ‘గరుడవేగ’ విడుదల కాగా… 2019 జూన్ 28న రాజశేఖర్ రీసెంట్ ఫిలిం ‘కల్కి’ రిలీజ్ అయింది. ఇలా తన గత రెండు చిత్రాలకి దాదాపు 20 నెలలు గ్యాప్ తీసుకున్న ఈ టాలెంటెడ్ స్టార్‌… ఇప్పుడు కేవలం 9 నెలల వ్యవధిలోనే తన తదుపరి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుండ‌డం విశేషం. మ‌రి… `గ‌రుడ‌వేగ‌` త‌ర‌హాలో కొత్త చిత్రంతోనూ రాజ‌శేఖ‌ర్ అల‌రిస్తాడేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 6 =