గుణ 369-‘మనసుకిది’ సాంగ్ రిలీజ్

2019 Latest Telugu Movie News, Guna 369 Movie Third Single Out Now, Magical Guna 369 Movie Third Single Out Now, Third Single Out From Guna 369, Guna 369 Songs, Manasukidhi Full Song From Guna 369 Movie Out Now, Manasukidhi Song From Guna 369, Guna 369 Telugu Movie Songs, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Guna 369 Movie Third Single Out Now

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్  .. కామెడీ ఇలా నాలుగు అంశాలతో మరో డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు కార్తికేయ. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘గుణ 369’. ఆగష్ట్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, టైలర్ ను రిలీజ్ చేయగా.. ఒక్కోక్కటిగా పాటలను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే తొలిపరిచయమా, బుజ్జి బంగారం పాటలను విడుదల చేసిన చిత్రయూనిట్.. ఇప్పుడు తాజాగా మనసుకిది అనే పాటను రిలీజ్ చేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ పాటను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో కార్తికేయ పక్కన మలయాళ బ్యూటీ అనఘ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రతినాయకుడిగా ఆదిత్య మీనన్ నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రను మంజుభార్గవి పోషిస్తోంది. స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను అనిల్ కడియాల, తిరుమల రెడ్డి నిర్మిస్తున్నారు. RX 100 వంటి బ్లాక్ బస్టర్ మూవీ కి సంగీతం అందించిన చైతన్ భరద్వాజే ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=yVCzt0mxxAk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − one =