నువ్విలా మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన విజయ్ దేవరకొండ పెళ్ళిచూపులు మూవీ తో సక్సెస్ ఫుల్ హీరోగా మారారు. అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసి, తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కు బెస్ట్ యాక్టర్ గా విజయ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకొన్నారు. మహానటి, గీత గోవిందం, టాక్సీవాలా వంటి సూపర్ హిట్ మూవీస్ తో విజయ్ టాలీవుడ్ లో విజయ కేతనం ఎగురవేస్తున్నారు. విజయ్ లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ ట్రైలర్ లోని లిప్ లాక్ సీన్స్ గురించి కొంతమంది చర్చించుకొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డియర్ కామ్రేడ్ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా విజయ్ దేవరకొండ తన మూవీస్ లోని లిప్ లాక్ సీన్స్ గురించి క్లారిఫై చేశారు. లిప్ లాక్ ద్వారా ఎమోషనల్ ఫీలింగ్ ను వ్యక్త పరచడమని, దానిని కొంతమంది ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారో ఆశ్చర్యంగా ఉందని, తన మూవీస్ లోని లిప్ లాక్ సీన్స్ ఆ మూవీస్ లోని కీలక సందర్భాలలో ఉంటున్నాయని, అందువల్ల వాటిని హై లైట్ చేయడం అనవసరమని
వివరణ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన డియర్ కామ్రేడ్ లో స్టూడెంట్స్ హక్కులపై పోరాడే స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నానని తెలిపారు.
[youtube_video videoid=vhJ8yfHy5oE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: