‘గుణ 369’ టీజర్ రిలీజ్

Guna 369 Teaser Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest TeluguMovie News,Tollywood Cinema News,Guna 369 Movie Teaser,Guna 369 Telugu Movie Teaser,Guna 369 Movie Offical Teaser,Guna 369 Movie Latest News,Karthikeya New Movie Guna 369 Teaser
Guna 369 Teaser Out Now

‘ఆర్ఎక్స్ 100’ సినిమా ఘన విజయంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ నటుడు కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే హిప్పీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా కాస్త నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు ‘గుణ 369’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా…దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తించేదిగా వుంది. ఈ టీజర్ చివరిలో కార్తికేయ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ హైలైట్ గా నిలుస్తోంది.

కాగా బోయపాటి దగ్గర అసోసియేట్ గా పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో కార్తికేయకు జోడిగా.. అనఘ అనే మలయాళ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను జ్ఞాపిక ప్రొడక్షన్స్ మరియు స్ప్రింట్ మీడియా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తిరుమల రెడ్డి – అనిల్ కడియాల నిర్మాతలు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాకు సంగీతం అందించిన చైతన్ భరద్వాజే ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా కార్తికేయకు ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]
[youtube_video videoid=p1nc-WWsSq4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =